Bihar: బీహార్ ముజఫర్‌పూర్‌లో జరిగిన వివాహ ఊరేగింపుకు హాజరైన నలభై మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2016 నుంచి బీహార్ రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలులో ఉంది. అయితే, పెళ్లికి హాజరైన వీరంతా మద్యం సేవించడంతో ఈ అరెస్టులు జరిగాయి. వరుడి తరుపున వచ్చిన వారంతా మద్యం సేవించి, ఊరేగింపులో నాగిన్ డ్యాన్సులు చేయాలనుకుంటున్నారని అధికారులు తెలిపారు.