మనలో చాలా మంది కొన్ని అవసరాలకు గాను ప్రభుత్వ అధికారుల నుంచి నివాస ధ్రువీకరణ పత్రాలు పొందుతుంటారు. అందుకు కొన్ని నియమ నిబంధనలతోపాటు నిర్దిష్ట ప్రక్రియ కూడా ఉంటుంది. కానీ.. ఇటీవల కుక్కకు నివాస ధ్రువీకరణ పత్రం జారీ అయిన విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన బీహార్‌లో జరిగింది. అయితే తాజాగా అదే బీహార్ రాష్ట్రం నవాడా జిల్లా సిర్దాల బ్లాక్‌లోని ఆర్టీపీఎస్ కార్యాలయానికి ‘డాగేష్ బాబు’ అనే పేరున్న మరో కుక్క…