తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు బిహార్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. పాట్నాలో సీఎం కేసీఆర్ చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్‌లో సీఎం నితీష్, డిప్యూటీ సీఎం తేజస్వి స్వాగతం పలికారు. గాల్వాన్ అమర సైనికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిచారు సీఎం. ఒక్కో కుటుంబానికి పదిలక్షల సహాయం అందజేశారు. బీహార్ సీఎం నితీష్‌తో కలిసి చెక్కులను తెలంగాణ సీఎం కేసీఆర్ అందించారు. అనంతరం సీఎం నితీశ్ కుమార్‌తో కలిసి భోజనం చేయనున్నారు. అనంతరం నితీష్ తో జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారు.…
తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు బిహార్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం పది గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12:15 గంటలకు పాట్నాకి చేరుకుంటారు. సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించిన ప్రకారం గాల్వాన్ లోయ ఘర్షణలో అమరులైన ఐదుగురు సైనికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నారు. ఈనేపథ్యంలో సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్ని ప్రమాదంలో చనిపోయిన 12 మంది బిహార్ వలస కార్మికుల కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సాయం అందించిన అనంతరం…