Tanish: చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో మంచి సినిమాల్లో నటించి మెప్పించాడు తనీష్. బాలనటుడిగా తన ప్రత్యేకతను చాటుకుని తర్వాత హీరోగా టర్న్ అయ్యి.. నచ్చావులే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత కొన్ని సినిమాలు హీరోగా చేశాడు కానీ, అవి ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి.