బిగ్ బాస్ షో సీజన్ – 5, 16వ రోజున చక్కని వినోదానికి చోటు దక్కింది. ‘అమెరికా అబ్బాయి, హైదరాబాద్ అమ్మాయి’ అనే పేరుతో బిగ్ బాస్ ఓ పెళ్ళి చూపుల తతంగాన్ని కంటెస్టెంట్స్ అందరితో చేయించాడు. ఇందులో అమెరికా అబ్బాయిగా శ్రీరామ్, అతని తల్లిగా ప్రియా నటించగా, శ్రీరామ్ పీఏగా విశ్వ, స్నేహితుడిగా సన్ని నటించారు. కాజల్ అతని లవర్ గా నటించింది. ఇక లహరి హైదరాబాద్ కు చెందిన అమ్మాయి కాగా ఆమె తల్లిదండ్రులుగా…