ఇటీవల కాలంలో తెలుగునాట బాగా ప్రాచుర్యం పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’. ఇప్పటికి నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో 5వ సీజన్ కి రెడీ అయింది. పోటీదారుల ఎంపిక పూర్తయి క్వారంటైన్ లో ఉన్నారు. మూడో సారి నాగార్జున హోస్ట్ గా సెప్టెంబర్ నుంచి ఈ షో ప్రసారానికి సిద్ధం అవుతోంది. షణ్ముఖ్, రవి, వర్షిణి వంటి పేరున్న కళాకారులు ఇందులో పాలు పంచుకోబోతున్నట్లు పుకార్లుతో సోషల్ మీడియాలో సందడి సందడిగా ఉంది.…