అఫ్జల్‌గంజ్‌లో బీదర్ దొంగల ముఠా కోసం 8 పొలిసు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితులు ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌కు చెందినట్లు పోలీసులు గుర్తించారు. అడ్డ దారుల్లో రాయ్‌పూర్ పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అఫ్జల్‌గంజ్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఆటోలో వెళ్లినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. అక్కడి నుంచి ఎటువైపు వెళ్లారని పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటివరకు వందకి పైగా సీసీ కెమెరాలను పోలీసులు జల్లెడ పట్టారు. ట్యాంక్ బండ్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్…