ఓ వైపు స్వాతి మలివాల్ కేసుకు సంబంధించి పోలీసుల విచారణ కొనసాగుతుండగా.. మరోవైపు రాజకీయాలు కూడా జోరందుకున్నాయి. దీని వెనుక బీజేపీ కుట్ర ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ ఆరోపణలను పూర్తిగా తిరస్కరించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో ఎంపీ స్వాతి మలివాల్‌ను కొట్టిన కేసు ఇప్పుడు ఊపందుకుంది. అంతకుముందు స్వాతితో బిభవ్ కుమార్ అనుచితంగా ప్రవర్తించాడని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అంగీకరించగా.. శుక్రవారం ఆప్ యూటర్న్ తీసుకుంది.
సార్వత్రిక ఎన్నికల వేళ స్వాతి మాలివాల్ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఇటీవల కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల వ్యవహారం చల్లారక ముందే ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘటన దేశ రాజకీయాల్ని కుదిపేస్తోంది.
సార్వత్రిక ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగలుతున్నాయి. ఇటీవలే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌పై విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ వేటు వేసింది.
సార్వత్రిక ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌పై వేటు పడింది.