(ఆగస్టు 21న భూమిక బర్త్ డే) చూడగానే తెలిసినమ్మాయి అనిపిస్తుంది భూమిక. ముద్దొచ్చే రూపంతో ఇట్టే తెలుగువారిని పట్టేసింది. తెలుగు చిత్రాలతోనే నటిగా వెలుగు చూసిన భూమిక ప్రస్తుతం కేరెక్టర్ యాక్టర్ గా బిజీగానే సాగుతున్నారు. ఉత్తరాది అమ్మాయి అయినా, దక్షిణాది వాసనలనే ఇష్టపడింది భూమిక. అందుకే తెలుగు, తమిళ చిత్రాలలో ఆమెకు మంచి పాత్రలు లభించాయి. వాటితో నటిగా తానేమిటో నిరూపించుకున్నారు భూమిక. నాగార్జున నిర్మించిన తెలుగు చిత్రం ‘యువకుడు’ ద్వారా భూమిక చావ్లా సినిమా…