గుత్త సుఖేందర్‌రెడ్డి. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్. ఈయనేమో కంచర్ల భూపాల్‌రెడ్డి. నల్లగొండ ఎమ్మెల్యే. ఇద్దరూ టీఆర్‌ఎస్ నాయకులే. కానీ.. ఒకరంటే ఒకరికి పడదు. చాలా గ్యాప్ ఉందనేది గులాబీ శ్రేణులు చెప్పేమాట. ఒకరిపేరు మరొకరు వినడానికి.. పలకడానికి.. చివరకు ఎదురుపడటానికీ ఇష్టపడరని చెబుతారు. ఆ మధ్య నల్లగొండ నియోజకవర్గంలోని ప్రముఖ ఆలయానికి మండలి ఛైర్మన్ గుత్తా వెళ్తే.. ఆలయ ఈవో, అర్చకులు కనీసం ప్రొటోకాల్ పాటించలేదట. అదంతా ఎమ్మెల్యే ఆదేశాలతోనే జరిగిందనేది గుత్తా వర్గీయుల ఆరోపణ. అక్కడ…