తెలుగు తమిళ భాషల్లో బైలింగ్వల్ సినిమాగా తెరకెక్కిన మూవీ ‘ఖైదీ’. ఒకరోజు రాత్రి జరిగే కథతో రూపొందిన ఈ మూవీ లోకేష్ కనగరాజ్ లాంటి యంగ్ టాలెంట్ ని అందరికీ పరిచయం చేసింది. దళపతి విజయ్ నటించిన ‘బిగిల్’ సినిమాతో బాక్సాఫీస్ క్లాష్ లో పోరాడి గెలిచిన ఖైదీ మూవీకి చాలా మంది ఫాన్స్ ఉన్నారు. ఈ మూవీలో కార్తీ చేసిన యాక్టింగ్ కి, నైట్ ఎఫెక్ట్ లో కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ కి ఫిదా…