కేంద్రమంత్రి నితిన్ గడ్కరి నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆయన 5,400 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన 26 రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, ప్రారంభోత్సవాలను నిర్వహించనున్నారు. పర్యటనలో భాగంగా ముందుగా కొమురం భీం జిల్లాకు వెళ్లనున్నారు. జాతీయరహదారి 363 ని జాతికి అంకితం చేయనున్నారు. కాగజ్ నగర్ ఎక్స్ రోడ్డు వద్ద ఉదయం 10 గంటలకు ప్రారంబోత్సవాలు,శంఖుస్థాపనలు చేయనున్నారు. కార్యక్రమాల్లో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి,బండిసంజయ్, రాష్ట్రమంత్రులు కోమటి రెడ్డి వెంకట్…