భట్టి విక్రమార్క పాదయాత్ర 100వ రోజు పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు #PeopelsMarch100Days అనే హ్యష్ ట్యాగ్‌ను ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. భట్టి పాదయాత్రకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
సాయంత్రం భట్టి విక్రమార్కకు వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్యులు. మరో 24 గంటలు భట్టి విక్రమార్కకు విశ్రాంతి అవసరం అని తెలిపారు. జ్వరం నార్మల్ గా ఉన్నప్పటికీ.. బాగా నీరసంగా ఉన్నారని డాక్టర్లు చెబుతున్నారు. ఈసీజీ, బిపి, బ్లడ్ టెస్ట్ లు కూడా నార్మల్ గా ఉన్నాయన్నారు. అయితే రేపు క్లినికల్ పరీక్షల తర్వాతే పాదయాత్ర పై నిర్ణయం తీసుకోనున్నట్లు భట్టి సంబంధీకులు చెబుతున్నారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నల్గొండ జిల్లాలో కొనసాగుతుంది. నకిరేకల్ మండలం కేతపల్లిలో లంచ్ విరామ సమయంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు.