తెలంగాణ రాష్ట్రంలో 2030 నాటికి 20వేల మెగావాట్ల గ్రీన్ఎనర్జీని ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతున్నామని, ఈ నేపథ్యంలో సెమీకండక్టర్ల పరిశ్రమలకు ఇక్కడ మంచి అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి , ఇంధనశాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. జపాన్ పర్యటనలో భాగంగా ఆయన గురువారం క్విటో నగరానికి సమీపంలో ఉన్న ప్రముఖ సెమీకండక్టర్ల పరిశ్రమ రోహ్మ్ ను సందర్శించి నిర్వాహకులతో మాట్లాడారు. ఆయనకు రోహ్మ్ కంపెనీ ప్రెసిడెంట్ ఇనో, కంపెనీ ఉన్నతాధికారులు తకహసి,…