మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కాన్వాయ్‌లోని 19 వాహనాలు మార్గమధ్యలో అకస్మాత్తుగా ఆగిపోయాయి. ప్రాథమిక దర్యాప్తులో సాంకేతిక లోపం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. కానీ.. అనంతరం వాహనాలు ఆగిపోవడానికి కల్తీ డీజిల్ కారణమని తెలుసుకున్నారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వాహన యజమానులకు ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు పెట్రోల్ పంపులు మోసాలకు పాల్పడుతుండడంతో వాహనదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. మీటర్ ను రీ సెట్ చేయకపోవడం, ఎలక్ట్రానిక్ చిప్ లు పెట్టి మోసం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని ఉప్పల్ లో ఘరానా మోసం వెలుగుచూసింది. భారత్ పెట్రోల్ పంపులో మోసం జరుగుతున్నట్లు వాహనదారులు తెలిపారు. మెహిఫిల్ రెస్టారెంట్ ఎదురుగా ఉన్న భారత్ పెట్రోల్ పంపులో జరుగుతున్న మోసాన్ని బయటపెట్టారు. Also Read:Robert Vadra:…