Priyamani: హీరోయిన్ ప్రియమణి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఆమె నటించిన భామాకలాపం 2 రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఈ సిరీస్ ప్రమోషన్స్ లో ప్రియమణి పాల్గొంటుంది. ఇప్పటికే భామాకలాపం హిట్ అవ్వగా దానికి సీక్వెల్ గా భామాకలాపం 2 రిలీజ్ అవుతుంది. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా ప్రియమణి తన మనసులో మాటలను బయటపెట్టింది.