Nagoba Jatara: ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లోని నాగోబా గుడి వద్ద నేడు నాగోబా మహా పూజల జాతర ఘనంగా ప్రారంభం కానుంది. రాత్రి మహాపూజతో జాతర ఆరంభమై ఫిబ్రవరి 4వ తేదీ వరకు కొనసాగుతుంది. మెస్రం వంశీయులు సంప్రదాయరీతిలో ఈ జాతరలో పాల్గొననున్నారు. నాగోబా మహా పూజ ప్రత్యేకంగా నాగోబా దేవుడి పూజార్చనతో ప్రారంభమవుతుంది. మహాపూజ అనంతరం తెల్లవారుజామున కొట్టకోడళ్ళ బేటింగ్ (దేవుడికి పరిచయం చేసే సంప్రదాయం) నిర్వహించనున్నారు. ఇది వంశీయ సంప్రదాయానికి ఎంతో ప్రత్యేకమైన ఆచారం.…