Darshan Case: హత్య నేరంలో జైలులో శిక్ష అనుభవిస్తున్న కన్నడ స్టార్ దర్శన్ తనకు దుప్పటి కావాలని కోర్టును కోరాడు. బుధవారం బెంగళూరులోని ట్రయల్ కోర్టులో అదనపు దుప్పటి కోసం విన్నవించుకున్నాడు. చలి కారణంగా తనకు నిద్ర పట్టడం లేదని చెప్పాడు. విచారణ ప్రక్రియ కోసం దర్శన్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు.