బెంగాల్ ఉపాధ్యాయులకు దేశ సర్వోన్నత న్యాయస్థానం తీపికబురు చెప్పింది. కొత్తగా ఉద్యోగుల్ని నియమించేంత వరకు ఉపాధ్యాయులుగా కొనసాగవచ్చని సుప్రీం ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది.
పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్‌మెంట్‌ను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. సీబీఐ దర్యాప్తు కొనసాగించడానికి మాత్రం సుప్రీంకోర్టు అనుమతించింది.