ఢిల్లీలో మరో 80 వేల మంది వృద్ధులకు నెలకు రూ.2000 పెన్షన్ ఇవ్వనున్నట్లు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ప్రకటించారు. ఇందుకోసం 24 గంటల్లోనే 10 వేల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. తాను ఎక్కడికి వెళ్లినా పింఛను ప్రారంభించాలని వృద్ధులు కోరేవారని కేజ్రీవాల్ చెప్పారు.