60 ఏళ్ల వయస్సులో ఎవరైనా ఏం చేస్తు్ంటారు. మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకుంటూ.. కృష్ణా రామా అంటూ కాలం వెళ్లదీస్తారు. కానీ ఓ వృద్ధురాలు మాత్రం అందం యువత సొంతం మాత్రమే కాదని నిరూపించింది. అందాల పోటీల్లో కుర్రకారు మాత్రమే గెలుస్తారన్న విశ్వాసాన్ని కూడా పటాపంచలు చేసింది అర్జెంటీనాకు చెందిన ఈ 60 ఏళ్ల అందాల భామ.