తలపతి విజయ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం “బీస్ట్” ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అంటే ఏప్రిల్ 13న థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే “బీస్ట్” ఫస్ట్ డే ఫస్ట్ షోను వీక్షించిన విజయ్ డైహార్డ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సినిమాపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఊహించినట్లుగానే ఈ హైజాక్ డ్రామాకు ఫ్యాన్స్ నుంచి మంచి స్పందనే వస్తోంది. సినిమా కథాంశం, సంభాషణలు, స్క్రీన్‌ప్లే, కామెడీ, నటీనటుల పర్ఫార్మెన్స్ బాగున్నాయంటూ ట్వీట్ల వర్షం మొదలైంది. విజయ్ నుంచి…