అడవుల్లో వుండాల్సిన వన్యప్రాణులు, పులులు, ఏనుగులు, ఎలుగుబంట్లు రోడ్లమీదకు, జనం మీదకు వచ్చేస్తున్నాయి. దీంతో జనం కంటిమీద కునుకులేకుండా గడపాల్సి వస్తోంది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో గురువారం రాత్రి ఎలుగుబంటి హల్ చల్ చేసింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, ఎంపీడీఓ కార్యాలయ పరిసరాలతో పాటు ప్రక్కన నున్న అపార్టుమెంటు ప్రాంగణంలోకి చొరబడి కాసేపు చక్కర్లు కొట్టింది. తమ ప్రాంతంలో ఎలుగుబంటి సంచరిస్తుందని తెలుసుకున్న స్థానికులు భయాందోళన చెందారు. కాసేపు ఆ ప్రాంతంలో తచ్చాడిన ఆడిన…