తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ కూలిన దుర్ఘటన యావత్ దేశాన్ని కన్నీటిపర్యంతం చేసింది. 13 మంది ఈ ప్రమాదంలో కన్నుమూశారు. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో తెలుగు బిడ్డ లాన్స్ నాయక్ హోదా సాయి తేజ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. సీడీఎస్ బిపిన్ రావత్‌కి వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో ఒకరిగా సాయితేజ సేవలందిస్తున్నారు. తన బాస్ బిపిన్ రావత్ తో కలిసి వెల్లింగ్టన్ వెళుతున్న వేళ.. తన భార్య శ్యామలకు ఒక సందేశం పంపారు సాయితేజ. ”హ్యాపీగా ఉండు..…