Asia Cup 2025: ఆసియా కప్ 2025 నిర్వహణ పైనా అనిశ్చితి నెలకొంది. ఈ నెల (జూలై) చివరి వారంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉంది. ఈ మీటింగ్ కు బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వేదికగా మారింది. అయితే, ఇప్పుడు ఇదే ప్రధాన సమస్యగా అయింది. ఇక్కడ జరగబోయే ఏసీసీ మీటింగ్‌కు తాము హాజరుకావడం లేదని ఇప్పటికే భారత్, శ్రీలంక దేశాలకు చెందిన క్రికెట్ బోర్డులు సమాచారం ఇచ్చాయని క్రికెట్ వర్గాలు తెలిపాయి