భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ 2024లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్‌ను తొలగించింది. రాబోయే సీజన్‌లో ఈ నిబంధనను రద్దు చేయనున్నట్లు రాష్ట్ర సంఘాలకు బీసీసీఐ ఇప్పటికే తెలియజేసింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నవంబర్ 23 నుండి ప్రారంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ డిసెంబర్ 15న జరుగుతుంది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను ప్రయోగాత్మకంగా ముందుగా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో బీసీసీఐ…
BCCI on Impact Rule in IPL 2024: ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్‌ను బీసీసీఐ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మ్యాచ్ జరుగుతుండగా అదనంగా బౌలర్ లేదా బ్యాటర్‌ను తీసుకొనే వెసులుబాటును కలిగింది. ఈ రూల్‌పై కొందరి నుంచి వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంపాక్ట్ రూల్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంపాక్ట్ రూల్ తనను ఆకట్టుకోలేదని, దీంతో ఆల్‌రౌండర్ల అభివృద్ధికి అడ్డంకిగా మారిందన్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ మేనేజ్‌మెంట్ ఈ రూల్‌పై…