ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ వైఫల్యం కొనసాగుతుంది. రూ. 13.25 కోట్లు పెట్టినందుకు ఒక్క మ్యాచ్ లో మాత్రమే సెంచరీతో చెలరేగిన బ్యూక్ ఆ తర్వాత ఒక్క మ్యాచ్ లోనూ ఆకట్టుకోలేకపోతున్నాడు. ఓపెనర్ నుంచి ఐదో స్థానం వరకు బ్యాటింగ్ వచ్చినా దారుణమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరుస్తున్నాడు.