తెలంగాణ సాంస్కృతిక ప్రతీక, రాష్ట్ర పండుగ బతుకమ్మ ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్.. తీరొక్కపూలను పేర్చుకుని తొమ్మిది రోజులపాటు ప్రకృతిని ఆరాధిస్తూ ఆనందోత్సాహాల నడుమ ఆటాపాటలతో ఆడబిడ్డలు బతుకమ్మ సంబురాలు జరుపుకుంటారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.. ఒకనాడు సమైక్యపాలనలో విస్మరించబడిన బతుకమ్మను స్వయం పాలనలో ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించిందన్న ఆయన… తెలంగాణ ప్రజల జీవనంలో భాగమైపోయిన ప్రకృతి పండుగ బతుకమ్మ, నేడు ఖండాంతరాలకు విస్తరించడం గొప్పవిషయమన్నారు. తెలంగాణ సంస్కృతికి…
తెలంగాణాలో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగల్లో బతుకమ్మ ఒకటి. ప్రతి ఏడాది దసరా సందర్భంగా జరుపుకునే ఈ పండగను తెలంగాణ ప్రభుత్వం సైతం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పండుగకు ముందు ‘బతుకమ్మ’ స్పెషల్ సాంగ్స్ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. చాలా మంది సంగీతకారులు విభిన్న పాటలతో యూట్యూబ్ లో బతుకమ్మను సెలబ్రేట్ చేస్తారు. అయితే మొదటిసారిగా బతుకమ్మ పాటకు సంగీతం అందించడానికి లెజెండరీ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ ముందుకు వచ్చారు.…
తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండగ కానుకగా బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభం అయినట్లు మంత్రి కేటీఆర్ అన్నారు. ఏలాంటి ఇబ్బందులు లేకుండా చీరల పంపీణీ కార్యక్రమం పూర్తి అయ్యేలా అన్నిచర్యలు తీసుకున్నామన్నారు మంత్రి. 18 సంవత్సరాలు నిండి, ఆహార భద్రత కార్డ్ కింద నమోదైన అర్హూలైన ప్రతి ఒక్క ఆడబిడ్డకు బతుకమ్మ చీర అందాలని సూచించారు. ప్రభుత్వ పథకంతో రాష్ట్రంలోని అడబిడ్డలకు అందమైన చీరతోపాటు, నేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు మంత్రి. 2017 నుంచి గత…