తెలంగాణలో ఆడపడుచులా అతి పెద్ద పండగ బతుకమ్మా.. ఈ బతుకమ్మా పండుగకు రాష్ట్రమంతా సందడిగా ఉంటుంది. ప్రతి ఇంట్లో బతుకమ్మలు రంగు రంగు పూలతో గుభాళిస్తాయి. ఆటపాటలతో బతుకమ్మను ఆడబిడ్డాలు కొలుచుకుంటూ తమ కుటుంబాలను చల్లగా చూడమ్మా అని దీవించమని వేడుకునేదే ఈ బతుకమమ్మ పండుగ.. తొమ్మిది రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు.
Kajal Aggarwal and Sreeleela played Bathukamma at Hanamkonda: తెలంగాణలో ‘బతుకమ్మ’ పండగ ఈ నెల 15న (మహాలయ అమావాస్య) ఆరంభం కానుంది. ఆడపడుచులంతా కలిసి చేసుకునే పూల పండగ బతుకమ్మ.. అమావాస్య నుంచి దుర్గాష్టమి వరకు తొమ్మిది రోజుల పాటు సందడిగా కొనసాగుతుంది. అయితే బతుకమ్మ సందడి ఈసారి ముందే ప్రారంభమైంది. ఆదివారం హనుమకొండలో హీరోయిన్స్ కాజల్ అగర్వాల్, శ్రీలీల బతుకమ్మ ఆడారు. భగవంత్ కేసరి ట్రైలర్ విడుదల కార్యక్రమంలో భాగంగా ఈ ఇద్దరు…
పేదింటి ఆడబిడ్డల మోముల్లో చిరునవ్వులు చూసేందుకు, సిరిసిల్ల నేత కార్మికులకు పని కల్పించేందుకు, ఆత్మహత్యలు దూరం చేసేందుకు బతుకమ్మ పండుగ సారెగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
తెలంగాణ పూల పండుగ బతుకమ్మ విశ్వ వేదికపై తన గొప్పతనాన్ని చాటేందుకు సిద్దమైంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో శనివారం (23 వ తేదీ) న ప్రపంచంలోని ఎత్తైన భవనం దుబాయ్ లోని బూర్జ్ ఖలీఫాపై, బతుకమ్మను ప్రదర్శించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. బూర్జ్ ఖలీఫా మీద బతుకమ్మ ను ప్రదర్శించబోయే తెర( స్క్రీన్) ప్రపంచంలోనే అతి పెద్దది కావడం మరో విశేషం. ఒకేసారి దేశవిదేశాలకు చెందిన లక్ష మంది బుర్జ్ ఖలీఫా స్క్రీన్…
కొంత కాలంగా తెలంగాణ రాజకీయం ఇప్పుడు హుజురాబాద్ చుట్టే తిరుగుతోంది. ఉప ఎన్నిక సమయం సమీపిస్తోంది. ప్రస్తుతం నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ప్రచారం కూడా రోజు రోజుకు ఊపందుకుంటోంది. ఏ ఒక్క ఓటరునూ నిర్లక్ష్యం చేయరాదని ప్రధాన పార్టీలు బావిస్తున్నాయి. అంది వచ్చిన అన్ని అవకాశాలను వాడుకుంటున్నారు. మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు బతుకమ్మ వేడుకలనూ వదలట్లేదు పార్టీలు. బతుకమ్మ పాటల్లో ఎన్నికల వేడిని రగిలిస్తున్నారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. దొంగ బీజేపీ ఉయ్యాలో.. గ్యాస్ ధరలను పెంచి…
మహిళలంతా భక్తి శ్రద్ధలతో బతుకమ్మ ఆడుతుండగా ఎమ్మెల్యే ధర్మారెడ్డి కారు బతుకమ్మల మీదుగా దూసుకెళ్లడం వివాదంగా మారింది. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలకేంద్రంలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఆత్మకూరు వచ్చిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి సెంట్రల్ లైటింగ్‌ను ప్రారంభించారు. ఆ సమయంలో వేణుగోపాలస్వామి దేవాలయం ఎదుట మహిళలు బతుకమ్మలు ఆడుకుంటున్నారు. ఎమ్మెల్యే వస్తున్నారని, రోడ్డుపై నుంచి బతుకమ్మలు తీసివేయాలని మహిళలను ధర్మారెడ్డి అనుచరులు చెప్పారు. మహిళలు కుదరదనడంతో.. వారిని తోసేసి బతుకమ్మల మీదుగా ఎమ్మెల్యే కారును పోనిచ్చారు.…
తొమ్మిది రోజులు జరుపుకునే బతుకమ్మ వేడుకల్లో ఒక్కో రోజుది ఒక్కో ప్రత్యేకత. రోజుకో రకమైన పూలతో, రోజుకో ప్రత్యేకమైన నైవేద్యాన్ని గౌరమ్మకు సమర్పిస్తారు. ఎంగిలిపూల బతుకమ్మ: మహాలయ అమవాస్య రోజు బతుకమ్మ వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామాస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. అటుకుల బతుకమ్మ: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.…
తెలంగాణ వాసులు ప్రతిష్టాత్మకంగా జరుపుకునే ‘బతుకమ్మ’ సంబరాలు మొదలయ్యాయి. ఈ తొమ్మిది రోజులూ సాయంత్రం కాగానే అందమైన పూలతో తయారు చేసిన ‘బతుకమ్మ’ను మధ్యలో పెట్టి చుట్టూ చేరి మహిళలంతా ఆటపాటలతో సందడి చేస్తారు. 9 రోజులపాటు రోజుకో రకమైన నైవేద్యం సమర్పిస్తూ రోజుకో పేరుతో బతుకమ్మను సెలెబ్రేట్ చేసుకుంటారు. అందులో ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానే బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ,…