Bangladesh: ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటాను వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాత్మక ఆందోళనలు ఏకంగా షేక్ హసీనా ప్రభుత్వాన్నే కూల్చాయి. బంగ్లాదేశ్ స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు ఇచ్చిన రిజర్వేషన్లను క్యాన్సిల్ చేయాలని విద్యార్థులు, ప్రజలు ఆందోళనలు చేశారు. చివరకు ఆ దేశ ఆర్మీ ఇచ్చిన అల్టిమేటంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఇండియా పారిపోయి వచ్చారు.