రాష్ట్రవ్యాప్తంగా సాధారణ ఎన్నికల కోసం హడావుడి కొనసాగుతుంటే, రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రం పాలకవర్గం మార్పుపై చర్చ సాగుతోంది. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా, పదవులతో పాటు ఆర్థిక లావాదేవీలే లక్ష్యంగా నేతలు సాగుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీలో రెండు వర్గాలుగా చీలిక ఏర్పడింది. మేయర్ వర్గానికి వ్యతిరేకంగా డిప్యూటీ వర్గం పావులు కదుపుతోంది. మేయర్ కు ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్ కు ఎంపీ మద్దతు ఉన్నట్లు కార్పొరేషన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.…