బంధన్ బ్యాంక్ తాత్కాలిక ఎండీ & సీఈవోగా రతన్ కుమార్ కేష్‌ను బ్యాంక్ నియమించింది. ప్రస్తుత ఎండీ & సీఈవో అయిన చంద్ర శేఖర్ ఘోష్ జూలై 9, 2024న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆయన స్థానంలో ఈ నెల 10 నుంచి రతన్ కుమార్ తాత్కాలిక ఎండీ, సీఈవోగా బాధ్యతలు చేపట్టానున్నారు.
Business Headlines: హైదరాబాద్‌లోని ప్రముఖ ఫార్మాస్యుటికల్ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ అద్భుతమైన ఫలితాలను నమోదు చేసింది. ఈ సంస్థ నికర లాభం ఏకంగా 108 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలోని మొదటి 3 నెలల్లో 571 కోట్లు మాత్రమే ప్రాఫిట్ రాగా ఈసారి 11 వందల 88 కోట్లు వచ్చాయి.