Banana Health Benefits: అరటిపండు ప్రతి సీజన్‌లో సులభంగా లభించే పండు. అన్ని వయసుల వారు దీనిని తినడానికి ఇష్టపడతారు. రుచికరంగా ఉండటమే కాకుండా.. ఇందులో ఫైబర్, పొటాషియం, విటమిన్ B6 సమృద్ధిగా ఉంటాయి. కానీ ప్రతిరోజూ అరటిపండు తినడం వల్ల బరువు పెరుగుతారా? అనే ప్రశ్న కొందరిలో ఉత్పన్నమవుతుంది. ఈ ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకుందాం.. నిజానికి అరటిపండ్లు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ, మితంగా తీసుకోవడం చాలా కీలకమంటున్నారు నిపుణులు.