మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తుది అంకానికి చేరుకుంది. ఉద్ధవ్ ఠాక్రే రాజీనామాతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతోంది. శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు అంతా బీజేపీకి మద్దతు ప్రకటించనున్నారు. దీంతో మరోసారి మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారని.. రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే డిప్యూటీ సీఎం అవుతారని ప్రచారం సాగుతోంది. గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీకి తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని దేవేంద్ర ఫడ్నవీస్ కోరనున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే అధికారం జేజారిపోవడంపై…