మంత్రివర్గ విస్తరణలో స్ధానం కోల్పోయిన అనంతరం తొలిసారి ప్రకాశం జిల్లాకు వచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఆయన అభిమానులు అనూహ్య రీతిలో ఘన స్వాగతం పలికారు. గుంటూరు, బాపట్ల జిల్లాల సరిహద్దు బొప్పూడి ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు చేరుకున్న ఉమ్మడి జిల్లా వైసీపీ శ్రేణులు వందల కార్లతో ర్యాలీగా వెళ్లి ఆయనను జిల్లాకు తీసుకు వచ్చారు. గుంటూరు, బాపట్ల జిల్లాల సరిహద్దుల వద్ద పర్చూరు, చీరాల నియోజకవర్గాల వైసీపీ నేతలు.. బొల్లాపల్లి టోల్ ప్లాజా…