బాలయ్య చిత్రంలో జయమ్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి నటసింహం బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా గోపీచంద్ మలినేని మూవీ అధికారిక ప్రకటన వెలువడింది. ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ లో మూవీ నిర్మిస్తున్నట్టు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రకటించింది. ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించబోతున్నాడు. క్రాక్తో మరోసారి సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేసిన మలినేని గోపీచంద్… బాలకృష్ణ చిత్రానికి తానే కథను సైతం సమకూర్చు కుంటున్నాడు. క్రాక్ తరహాలోనే రియల్ ఇన్సిడెంట్స్ తో ఈ సినిమా తెరకెక్కుతుందట. విశేషం ఏమంటే… క్రాక్లో జయమ్మ పాత్రకు జీవంపోసిన శరత్ కుమార్ డాటర్ వరలక్ష్మి… బాలయ్య బాబు చిత్రంలోనూ ఓ కీ-రోల్ పోషించబోతోందని తెలుస్తోంది. మన కథానాయికలు కొందరికి కోలీవుడ్ లో విభిన్నమైన పాత్రలు లభిస్తున్నట్టుగానే… వరలక్ష్మీ శరత్ కుమార్ కు తెలుగులో దర్శక నిర్మాతలు డిఫరెంట్ క్యారెక్టర్స్ ను ఆఫర్ చేస్తున్నారు. దాంతో కొంతకాలంగా వర తెలుగు సినిమాలకే అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటికే తెనాలి రామకృష్ణ మూవీలో నటించిన వరలక్ష్మి ఈ యేడాది క్రాక్తో పాటు నాందిలోనూ అద్బుతమైన పాత్రను పోషించి, నటిగా తెలుగు ప్రేక్షకుల మనుసుల్ని దోచుకుంది. ఇక మాస్ హీరో బాలకృష్ణ చిత్రంలో నటించే అవకాశం రావడంతో వర ఇంకెంత రెచ్చిపోతుందో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?