Balakrishna Speech About NTR at NTR Ghat: నేడు టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 101వ జయంతి. ఈ సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించారు. నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తదితరులు అంజలి ఘటించారు. తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకుని ఎన్టీఆర్‌ను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్య బాబు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ సేవలను కొనియాడారు. ‘ఎన్టీఆర్ అంటే ఓ…