కేరళ ప్రభుత్వం బక్రీద్ ను పురస్కరించుకుని కరోనా ఆంక్షల నుంచి మూడు రోజుల మినహాయింపునిచ్చింది. అయితే కేరళ ప్రభుత్వ నిర్ణయం విస్మయానికి గురిచేస్తోందని సుప్రీంకోర్టు మండిపడింది. ఈ మినహాయింపులతో కరోనా కేసులు భారీగా పెరిగితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని కేరళ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాపై అందరు యుద్ధం చేస్తున్న వేళ పూర్తి మినహాయింపులివ్వడం చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. ఆర్టికల్ 21, ఆర్టికల్ 144ను కేరళ ప్రభుత్వం ఒకసారి క్షుణ్ణంగా చదువుకోవాలని,…
ఏపీలో కోవిడ్ నియంత్రణ కోసం అమలు చేస్తున్న కర్ఫ్యూ కొనసాగుతున్న దృష్ట్యా బక్రీద్ నిర్వహణకు ఆంక్షలు విధించింది ప్రభుత్వం. ఈద్గాహ్ లు, బహిరంగ ప్రదేశాల్లో ప్రార్ధనలు నిషేధిస్తున్నట్టు మైనారిటీ సంక్షేమశాఖ ప్రకటించింది. భారీ జన సమూహాలను నివారించేందుకు మసీదుల్లో మాత్రమే ప్రార్ధనలకు అనుమతినిచ్చింది. భౌతిక దూరం పాటిస్తూ.. మసీదుల్లో 50 శాతం మందికి మాత్రమే ప్రార్ధనలకు అనుమతిస్తున్నట్టు మైనారిటీ సంక్షేమశాఖ పేర్కొంది. మాస్కులు లేకుండా మసీదుల్లోకి అనుమతించవద్దని కమిటీలకు ఆదేశాలు జారీ చేశారు. మసీదు ప్రాంగణాల్లో శానిటైజర్లు,…