Sathyaraj: కోలీవుడ్ నటుడు సత్యరాజ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సత్యరాజ్ తల్లి నతంబాల్ మృతి చెందారు. ఆమె వయస్సు 94. గత కొన్నేళ్లుగా వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఈరోజు కోయంబత్తూర్ లోని తన స్వగృహంలో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో సత్యరాజ్ ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి.