పోటీ చేయడానికి అభ్యర్థిని నిలబెట్టడం వరకు ఓకే..! కానీ.. ఓట్లేయించుకోవడం ఎలా? బద్వేల్‌లో బీజేపీ ముందు ఉన్న అతిపెద్ద సవాల్ ఇదేనట..! తాపీగా కూర్చుని డిపాజిట్ లెక్కలు వేసుకుంటున్నారట నాయకులు. ఎలాగో ఏంటో.. ఈ స్టోరీలో చూద్దాం. 2019లో బీజేపీకి వచ్చింది 735 ఓట్లే..!డిపాజిట్ దక్కేంత ఓట్లు వస్తాయా.. లేదా? బద్వేలు ఉపఎన్నికలో ప్రతిపక్షపాత్ర పోషించేందుకు బీజేపీకి అరుదైన అవకాశం దక్కింది. చనిపోయిన సిట్టింగ్ మెంబర్ కుటుంబానికే టిక్కెట్ కేటాయించడంతో టీడీపీ, జనసేనలు బరిలో నుంచి తప్పుకొన్నాయి.…
కడప జిల్లాలోని బద్వేల్ ఉప ఎన్నికకు రోజులు దగ్గరపడుతున్నాయి. దీంతో అక్కడ రాజకీయవేడి రాజుకుంటోంది. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి దాసరి సుధ గెలుపు లాంఛనమే అని అంతా భావిస్తున్నారు. అయినప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డి బద్వేల్ పై ప్రత్యేకంగా గురిపెట్టారు. వైసీపీకి వ్యతిరేకంగా పోటీ చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు రాకుండా చూడాలని సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ శ్రేణులను ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఉప ఎన్నికలో వైసీపీ ఏమేరకు మెజార్టీ సాధిస్తుందనేది ఆసక్తికరంగా…