పూర్ణ ప్రధాన పాత్రధారిణిగా తేజ త్రిపురాన హీరోగా నటించిన సినిమా ‘బ్యాక్ డోర్’. కర్రిబాలాజీ దర్శకత్వంలో బి.శ్రీనివాసరెడ్డి నిర్మించిన ఈ సినిమా బాలకృష్ణ నటించిన ‘అఖండ’తో పాటు 3వ తేదీన విడుదల అవుతోంది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులను కె.ఆర్. ఫిలిమ్ ఇంటర్నేషనల్ అధినేత, పంపిణీదారుడు కందల కృష్ణారెడ్డి పొందారు. ఈ సినిమా విడుదల పురస్కరించుకున్న ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాతల మండలి కార్యదర్శులు ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల, నిర్మాత ఆచంట గోపీనాథ్, ‘రావణలంక’ హీరో…