‘బ్యాక్ డోర్’కి ‘అఖండ’మైన ఆదరణ లభిస్తుంది: దర్శక నిర్మాతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూర్ణ ప్రధాన పాత్రధారిణిగా తేజ త్రిపురాన హీరోగా నటించిన సినిమా ‘బ్యాక్ డోర్’. కర్రిబాలాజీ దర్శకత్వంలో బి.శ్రీనివాసరెడ్డి నిర్మించిన ఈ సినిమా బాలకృష్ణ నటించిన ‘అఖండ’తో పాటు 3వ తేదీన విడుదల అవుతోంది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులను కె.ఆర్. ఫిలిమ్ ఇంటర్నేషనల్ అధినేత, పంపిణీదారుడు కందల కృష్ణారెడ్డి పొందారు. ఈ సినిమా విడుదల పురస్కరించుకున్న ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాతల మండలి కార్యదర్శులు ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల, నిర్మాత ఆచంట గోపీనాథ్, ‘రావణలంక’ హీరో క్రిష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ చిత్ర విజయంపై నమ్మకంతో ప్రపంచవ్యాప్తంగా పంపిణీ హక్కులు తీసుకున్నట్లు కందల కృష్ణారెడ్డి చెబుతున్నారు.

ఇక బాలకృష్ణ ‘అఖండ’లో ముఖ్య పాత్ర పోషించిన పూర్ణ తమ సినిమాలో మెయిన్ లీడ్ గా నటించటం తమకు కలసి వచ్చే అంశమని, బాలకృష్ణ వీరాభిమాని నెల్లూరుకు చెందిన కందల కృష్ణారెడ్డి ఈ సినిమా విడుదల చేస్తుండటం విశేషమని చెబుతున్నారు దర్శకనిర్మాతలు. బాలయ్య ‘అఖండ’తో పాటు వస్తున్న తమ సినిమాకు కూడా ఆఖండమైన ఆదరణ లభించాలని కోరుకుంటున్నామన్నారు. ముఖ్య అతిథులు కూడా ‘బ్యాక్ డోర్’ కి అఖండమైన ఆదరణ దక్కుతుందని అభిలషించారు.
Also Read
- Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
- Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
- The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
- Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి 'హనుమాన్ అంశ్' - సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!

- Tags
- Back door movie
- Tollywood
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?