భారతీయ సినీ సంగీత రంగంలో విశిష్ట స్థానం కలిగిన గాయకుడు బబ్లా మెహతా ఈ నెల 22న ముంబైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషాద వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘గోల్డెన్ వాయిస్ ఆఫ్ ముఖేష్’ గా గుర్తింపు పొందిన బబ్లా మెహతా, తన మధుర గాత్రంతో అనేక హిట్ పాటలను అందించారు. ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌తో కలిసి పాడే అరుదైన…