BJP MLA: మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే బాబన్‌రావ్ లోనికర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. రాష్ట్రంలోని జల్నా జిల్లాలోని తన అసెంబ్లీ నియోజకవర్గం పర్తూర్‌లో జరిగిన ‘‘హర్ ఘర్ సోలార్’’ పథకంపై ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను హైలైట్ చేస్తూ , బీజేపీని విమర్శించే వారిని ఉద్దేశిస్తూ కామెంట్స్ చేశారు. ‘‘తన పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శించే వ్యక్తులు మా వల్లే బట్టలు, బూట్లు, మొబైల్స్, పథకాలకు సంబంధించి డబ్బు, విత్తనాల…