Ayodhya Ram Mandir : అయోధ్య రాములోరి ఆలయ నిర్మాణానికి భక్తులు భారీ విరాళాలు ఇవ్వడంతో పాటు వారి చేతనైనంత చేయూతను అందిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం నాడు ఆలయంలో రామలాల వ్రతం, నిత్య జ్యోతి ప్రజ్వలన కోసం ఆరు వందల కిలోల ఆవు దేశీ నెయ్యిని విరాళంగా అందజేశారు.