రాజ్‌కోట్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న నాలుగో టీ20లో టీమిండియాలో మార్పు అనివార్యంగా కనిపిస్తోంది. యువ పేసర్ అవేష్ ఖాన్ స్థానంలో అర్ష్ దీప్ సింగ్ తుది జట్టులోకి రానున్నాడు. వైజాగ్ వేదికగా జరిగిన గత మ్యాచ్‌లో అవేష్ ఖాన్ గాయపడ్డాడు. అతడి చేతి వేలికి గాయమవ్వడంతో మ్యాచ్ మధ్యలోనే డగౌట్‌కు చేరాడు. ఈ క్రమంలోనే అవేష్ ఖాన్ నాలుగో టీ20కి దూరం కానున్నాడు. కాగా ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన అవేష్ ఖాన్ పెద్దగా రాణించిందేమీ లేదు.…