HYD Traffic Police : హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు నగర పోలీసులు కొత్త అడుగు వేశారు. సాధారణంగా ప్రధాన జంక్షన్ల వద్ద కనిష్టం ఇద్దరు, గరిష్టం ముగ్గురు పోలీసులు విధుల్లో ఉంటారు. కానీ రెండు జంక్షన్ల మధ్యలో సమస్యలు తలెత్తినప్పుడు స్పందన ఆలస్యమవుతుండేది. ఈ లోటు తీర్చేందుకు ప్రత్యేకంగా ట్రాఫిక్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (HCSC) సహకారంతో తొలి దశలో 50 అత్యాధునిక అవెంజర్ వాహనాలను కొనుగోలు…