హైదరాబాద్‌లో తమ సంస్థ విస్తరణకు మోనార్క్ ట్రాక్టర్స్ సంస్థ ముందుకు వచ్చింది. హైదరాబాద్‌లోని తమ పరిశోధన-అభివృద్ధి సంస్థను విస్తరించే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సంస్థ ప్రతినిధులు చర్చించారు.
సరికొత్త సాంకేతికత వేగంగా అందుబాటులోకి వస్తోంది. మనుషులను మోసుకెళ్లే డ్రోన్లు, తొక్కకుండానే వెళ్లే సైకిళ్లు ఇలా సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందుతోంది. ఇందుకు హైదరాబాద్ వేదిక అవుతోంది. తాజాగా డ్రైవర్ లేకుండా నడిచే కారు ఇప్పటికే ఐఐటీ హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది.