భారతీయ కస్టమర్లలో భద్రతకు ప్రసిద్ధి చెందిన స్కోడా.. గత నెల మే 2024లో కార్ల విక్రయాల డేటాను విడుదల చేసింది. గత నెలలో స్కోడా స్లావియా అమ్మకాలలో అగ్రస్థానాన్ని సాధించింది. మొత్తం 1,538 యూనిట్ల కార్లను విక్రయించింది. గతేడాది 2023 మేలో స్కోడా స్లావియా మొత్తం 1,695 యూనిట్ల కార్లు అమ్ముడయ్యాయి.
బైక్, స్కూటర్ తయారీదారు టీవీఎస్ (TVS) భారతదేశంలో రేసింగ్ కోసం తన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్‌ను పరిచయం చేసింది. ఈ బైక్ పేరు అపాచీ RTE. కొంతమంది భాగస్వాముల సహకారంతో కంపెనీ ఈ బైక్‌ను తయారు చేసింది. ఇది ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్.. ఈ బైక్ గంటకు 200 కిమీ కంటే ఎక్కువ వేగంతో వెళ్తుంది.
Tata Motors: టాటా మోటార్స్ కార్లు కొనుగోలు చేయాలనుకునే వారు ఇకపై మరింత ధనాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. టాటా మోటార్స్ ఫిబ్రవరి 1 నుంచి అన్ని మోడళ్లపై ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్, పంచ్, నెక్సాన్, హారియర్, సఫారీ, టియాగో ఈవీ, టిగోర్ ఈవీ, నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీలపై ధరలు పెరగనున్నాయి.