ఆడం మహమూద్ అనే బార్బర్ వద్ద క్యారీ కటింగ్ చేసుకున్నాడు. అందుకు 30 యూరోలు అంటే.. మన కరెన్సీలో రూ.2,718 అయింది. అయితే.. ఈ ఆసీస్ కీపర్ తన వద్ద అంత డబ్బు లేదని, తప్పకుండా ఇచ్చేస్తానని ఆడంకు ప్రామిస్ చేశాడు. కానీ, ఇప్పటివరకు డబ్బులు ఇవ్వలేదు. దీంతో విసుగెత్తిపోయిన బార్బర్ మహమూద్ క్యారీకి ఒక డెడ్‌లైన్ విధించాడు.